calender_icon.png 15 April, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తో అంబేద్కర్ నిరంతర పోరాటం

14-04-2025 01:34:08 AM

  1. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు నెహ్రూ కుట్రలు
  2. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
  3. ఖైరతాబాద్, సీతాఫల్‌మండిలో అంబేడ్కర్ విగ్రహాల శుద్ధి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కుట్రలతో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబే ద్కర్ నిరంతరం పోరాడాల్సి వచ్చిందని, ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు నాటి ప్రధాని నెహ్రూ అనేక కుట్రలకు తెరతీశారని, ఒక దశలో అంబేద్కర్‌కు వ్యతిరే కంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. 

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బంజారాహిల్స్ జీవీకే సర్కిల్, సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను పాలు, నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదన్నారు.

అంబేడ్కర్‌పై కక్షపెట్టుకుని ఆయనకు దక్కాల్సిన గౌర వాన్ని కాంగ్రెస్ దక్కనివ్వలేదని మండిపడ్డారు. అందుకే అంబేద్కర్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్ తీరును విభేదిస్తూనే వచ్చారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తుందన్నారు.

అంబేద్కర్ జీవితానికి ముడిపడి ఉన్న ఐదు ముఖ్య ప్రదేశాలను బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాలుగా నామకరణం చేసిందని కొనియా డారు.  కార్యక్రమాల్లో బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగేశ్వర్‌రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి, పార్టీ నాయకులు సారంగపాణి,  వీరన్న పాల్గొన్నారు.