మందమర్రి (విజయక్రాంతి): అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పట్టణ ఎస్సై రాజశేఖర్, మండల తహశీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కుల కోసం, సమాజంలోని అసమానతలను రూపుమాప డానికి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన సేవలను వారు కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాధించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఆయన కోరారు. అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు మొయ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు పాత వీరస్వామి, పల్లె నర్సింహులు, కోడెం శ్రీనివాస్, నెరువట్ల శ్రీనివాస్ లతో పాటు పట్టణంలోని దళిత, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పాత్రికేయుల ఆధ్వర్యంలో...
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో పాత్రికేయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎండీ సలమొద్దీన్, చెట్టిపల్లి విజయ్, మద్ది వేణుగోపాల్ గౌడ్, తాండ్ర శ్రీనివాస్, దుద్దెల తిరుపతి, చాట్లపల్లి అనిల్, కుమ్మరి రమేష్, ఖాజా మోహిణుద్దీన్, సకినాల శంకర్, సత్యనారాయణలు పాల్గొన్నారు.