calender_icon.png 6 April, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయం సర్వమత సమానం

05-04-2025 01:47:08 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జై భీమ్ జై బాపు  జై సం విదాన్ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్, గొట్టిముక్కుల గ్రామాలలో శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి(Congress Party Mandal President Ananth Reddy) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అనంతరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, పల్లె రామస్వామి గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం సర్వమత సమానమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే దేశ ప్రజల జీవనస్థితిగతులు ప్రగతివైపు పయనించడం ఖాయమని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్ల భారత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, గ్రామ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి ,సంతోష్ రెడ్డి, సీతారాం మధు, నాయకులు నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి ,శమీ ,శంకర్, ఈశ్వర్ గౌడ్, శంకర్ రెడ్డి ,వినీత్ , రమేష్ ,మరి శేఖర్, బాల్ నర్స్, బాలరాజ్, నరేష్ ,రామ్ రెడ్డి, నహీం  తదితరులు పాల్గొన్నారు