- ఎమ్మెల్సీగా పట్టభద్రుల గొంతుకనవుతా
- అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, డిసెంబరు 1 (విజయక్రాంతి): స్వామి వివేకానంద, భగత్‌సింగ్ స్ఫూర్తితో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే, సా విత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ట్రస్మా రా ష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ఎస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. సాధారణ ఓటరుకున్న ఉన్న గౌరవం కూడా ప్రభుత్వాలు, పార్టీలు పట్టభద్రులకు ఇవ్వడం లేదన్నారు. పట్టభద్రుల సమస్యలపై అవగాహన ఉన్నవాళ్లు ఎమ్మెల్సీగా ఉం డకపోవడమేనని కారణమన్నారు.
అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానిగా తాను ఎంతోమంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేశానని, ఎంతో మంది పట్టభద్రులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించా నని అన్నారు. తన వరకు చేరుకోలేని వారు ఎందరో ఉన్నారని, వారి సమస్యల సాధనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రతినిధిగా శాస నమండలిలో అడుగుపెట్టి వారి గొంతుకను వినిపిస్తానన్నారు. కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీగా పట్టభద్రులు తనను గెలిపించాలని కోరారు.