calender_icon.png 23 January, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచం మెచ్చిన మేధావి అంబేద్కర్

07-12-2024 02:44:07 AM

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్ సిటీబ్యూరో/కూకట్‌పల్లి, డిసెంబర్ 6: ప్రపంచం మెచ్చిన మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురష్కరించుకొని  కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో శుక్రవారం నిర్వహించిన మహాపరినిర్యాణ దివాస్ కార్యక్రమా నికి భట్టి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. అంబేద్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి దేశాన్ని పూర్తిస్థాయి ప్రజాసామ్య దేశంగా మార్చడంలో అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడా నికి ఏకైక మార్గం విద్య అని నమ్మడంతో పాటు అలాంటి పీడితవర్గాలకు అంబేద్కర్ అండగా నిలిచారన్నారు. నేటి యువత ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జేఎన్‌టీయూహెచ్ అధ్యాపకులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.