calender_icon.png 16 April, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక, రాజకీయ, కులరహిత, సమానాత్వమే అంబేద్కర్ అజెండా

14-04-2025 05:32:23 PM

ఖానాపూర్ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మేష సతీష్..

ఖానాపూర్ (విజయక్రాంతి): ఆర్థిక, రాజకీయ, కుల రహిత సమానత్వమే, అంబేద్కర్ ఎజెండా అని దాన్ని సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, అంబేద్కర్ సంఘం ఖానాపూర్ మండలం అధ్యక్షులు మేష సతీష్ అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో ముందుగా విద్యానగర్ విశ్రాంతి భవనం నుంచి ర్యాలీగా ప్రారంభించి అంబేద్కర్ రాజ్యాంగ రచన విషయాలను, చిత్రపటాలను, పలువురికి విషాధికరిస్తూ, పట్టణం అంబేద్కర్ చౌక్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు అంబేద్కర్ జయంతి, రాజ్యాంగ రచన, పీడిత దళిత వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు రాజుర సత్యం, అంకం రాజేందర్, కాంగ్రెసు పార్టి మండల అద్యక్షుడు ధోనికేని దయానంద్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్, జన్నారపు శంకర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజా గంగన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మజీద్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు ద్యవతి రాజేశ్వర్, నేత శ్యామ్, పండుగ పెద్దలు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నందిరామయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరసయ్య, మునుగురి ప్రణీత్, అంబేద్కర్ కుమార్, భారత నాస్తిక సంఘం జిల్లా అధ్యక్షులు రాజకుమార్, మేదరి రాజేశ్వర్, రాజేశ్వర్, దాసరి రాజన్న, పలువురు అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.