calender_icon.png 19 September, 2024 | 9:38 PM

మంత్రుల వద్ద రాయబేరాలు!

19-09-2024 01:33:09 AM

  1. కబ్జాలు కాపాడుకునేందుకు అక్రమార్కుల విశ్వ ప్రయత్నం
  2. మంత్రి తుమ్మలను కలిసిన కార్పొరేట్ స్కూళ్ల యజమానులు
  3. కబ్జాల తొలగింపు విషయంలో రాజీలేదని తుమ్మల క్లారిటీ  

ఖమ్మం, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఖమ్మంను అల్లకల్లోలం చేసిన వరదలకు కారణమైన భూకబ్జాదారులు తమ అక్రమ కట్టడాలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏకంగా మంత్రుల చుట్టూ తిరుగుతూ తమకు సాయం చేయాలని కోరుతున్నట్టు విశ్వసనీయ సమాచా రం. జిల్లా కు  చెందిన ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాదారుల అంతు చూడాల్సి ందేనని కలెక్టర్, ఇరిగేషన్ అధికారులను ఆదేశించడంతో సర్వే పనుల చకాచకా జరుగుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నా లాలు, ఇతర ప్రభుత్వ స్ధలాల ఆక్రమణల లె క్క తేల్చేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అదే సమయంలో కబ్జాలు సంగతి తేల్చాలని ఖ మ్మం నగర ప్రజలు, స్వచ్చంద సంస్థలు ఆం దోళనలు చేస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉ న్న కవిరాజ్‌నగర్ కూడా వర ద ముంపునకు గురికావడం పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బు ధవారం కూడా బీఎస్పీ ఆధ్వర్యంలో అం బేద్కర్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

కబ్జాదారులను వదిలేదీ లేదు

తనను కలిసేందుకు వస్తున్న వారిని విష యం సూటిగా చెప్పాలని మంత్రి తుమ్మల అడిగినట్టు తెలిసింది. తమపై కబ్జా ఆరోపణలు వస్తున్నాయని, వాటి గురించి మాట్లాడేందుకు వచ్చినట్టు వారు చెప్పినట్టు సమాచారం. మర్యాదపూర్వకంగా ఏర్పాటు చేసే లంచ్‌కు, డిన్నర్‌కు రావడానికి తనకు అభ్యంతరం లేదని, కబ్జా అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని వారికి మంత్రి ఖరాఖండిగా చెప్పినట్టు తెలిసింది.  నగరంలో జరిగిన కబ్జాలపై సర్వేచేసి, ఎక్కడెకక్కడ కబ్జాలు జరిగాయో తేల్చాలని ఇప్పటికే కలెక్టర్‌ను ఆదేశించామని, వాటి సంగతి త్వరలోనే తేలుస్తామని మంత్రి స్పష్టంచేసినట్టు సమచారం. రి యల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన వారు సైతం మంత్రులను కలిసినట్టు తెలుస్తుంది.

ఖానాపురం చెరువు, లకారం చెరువు, ధ్వ ంసలాపురం చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలోనే చాలా వెంచర్లు వెలిశాయి. వాటిని కాపాడుకునేందుకు కబ్జాదారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కట్టడాలు కూల్చకముందే ఈ గండం నుంచి బయటపడేందుకు వారు చేయని ప్రయత్నం లేదు. ముగ్గురు మంత్రులు నగరంలోని కబ్జాల పట్ల తీవ్ర అ సంతృప్తితో ఉన్నారు. కబ్జాల విషయంలో క ఠినంగా వ్యవహరించాలనే దృఢ సంకల్పంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. కబ్జాదారుల అం తు చూడాల్సిందేనన్న స్థానికుల డిమాండ్ తో తాజాగా వైరా రోడ్డులో జిల్లా కోర్టు సమీపంలోని ఖనాపురం చెరువు కాల్వపరిధి లో నిర్మించిన ఓ కట్టడాన్ని ‘కుడా’ అధికారులు కూల్చివేశారు. అంతేకాకుండా కాల్వను ఆనుకుని ఉన్న అపార్ట్‌మెంట్, ఇతర కట్టడాల గు రించి కూడా సర్వే చేస్తున్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత కబ్జాల అంతు చూడడం ఖాయమని అంటున్నారు. 

మంత్రి చుట్టూ అక్రమార్కుల చక్కర్లు

ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న తరుణంలో తమను కాపాడుకునేందుకు కొంత మంది మంత్రుల వద్దకు రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును క్యాంప్ కార్యాలయంలో కొందరు మంత్రిని కలిసినట్టు తెలిసింది. అసలు విషయాన్ని మంత్రికి చెప్పకుండా.. తమకు టైం ఇవ్వాలని.. ఒక రోజు లంచ్‌కు వచ్చి తమతో గడపాలని కోరినట్టు సమాచారం. మంత్రిని కలిసిన వారంతా ప్రైవేట్ స్కూళ్ల యజమానులు కావడం గమనార్హం. ఖమ్మంలోని చైతన్యనగర్ ప్రాంతంలో చెరువు అలుగు వాగును, అక్కడే ఉన్న రోడ్డును ఆక్రమించి ఓ కార్పొరేట్ స్కూలు భవనాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కాలువ, రోడ్డు కబ్జా చేసి స్కూలు కట్టడం వల్లనే చైతన్యనగర్, కవిరాజనగర్ పరిసర ప్రాంతాలు వరదల్లో చిక్కుకుని, ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోయారు. పెద్ద ఎత్తున నష్టపోవడానికి కారణమైన ఈ కార్పొరేట్ స్కూలు భవనాన్ని కూల్చాల్సిందేనని వరద బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రిపై కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇదే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల్లోని కార్పొరేట్ స్కూళ్లు ఎనెస్పీ కాల్వను ఆక్రమించి, నిర్మించడంతో వాటి సంగతి కూడా తేల్చాందేనని ఒత్తిడి వస్తున్న క్రమంలో  ప్రైవేట్ స్కూళ్ల యాజమానులు తాజాగా మంత్రి తుమ్మలను కలవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రిని కలిసిన వారిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కూళ్ల యజమానులు ఉండడంతో ప్రజల అనుమానాలకు బలం చేకూరుతుంది.