calender_icon.png 27 January, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జన్మదిన వేడుకలు

26-01-2025 07:13:40 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నాడు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్స్, వివిధ సంఘాల నాయకులు, బ్లడ్ ఆర్గనైజర్స్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై  ఎమ్మెల్యే వెంకట్రావు జన్మదిన వేడుకల్లో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మండల నాయకుల ఆధ్వర్యంలో భారీ కేక్ ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సతీమణి ప్రవీణ కలిసి కట్ చేయగా ఈ సందర్భంగా కార్యకర్తలు శాలువాతో ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని మండల నాయకులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సతీమణి ప్రవీణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నాయకులు, యూత్, కార్యకర్తలు, అభిమానులు, వివిధ సంఘాల చైర్మన్ల్, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.