- తదుపరి స్థానాల్లో బజాజ్‌లు, బిర్లాలు
- హురున్ జాబితా
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ ధనిక కుటుంబాల్లో అంబానీ కుటుంబం 309 బిలియన్ డాలర్ల (రూ.25.75 లక్షల కోట్లు) విలువతో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా హురున్ విడుదల చేసిన జాబితా ప్రకారం దేశ జీడీపీలో ఈ కుటుంబం సంపద 10 శాతానికి సమానం. 7.13 లక్షల కోట్ల సంపదతో బజాజ్ కుటుంబం ద్వితీయస్థానంలో, రూ.5.39 లక్షల కోట్ల విలువతో బిర్లా కుటుంబం తృతీయస్థానంలో ఉన్నాయి.
రూ.4,71,200 కోట్ల సంపదతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన జిందాల్ కుటుంబం నాల్గవస్థానంలో, రూ.4,30,600 కోట్ల సంపదతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నాడార్ కుటుంబం ఐదో స్థానంలో నిలిచాయి. మహీంద్రా కుటుంబం రూ.3,45,200 కోట్ల విలువతో తదుపరి స్థానంలో ఉన్నది.