calender_icon.png 2 April, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ కుబేరుల జాబితా నుంచి అంబానీ ఔట్

28-03-2025 12:41:54 AM

మొదటి స్థానాన్ని నిలుపుకున్న ఎలాన్ మస్క్

టాప్ అంబానీకి దక్కని చోటు

మహిళల టాప్ఛ్ భారత మహిళ రోష్నీ నాడార్

న్యూఢిల్లీ, మార్చి 27: భారత అపరకుబేరుడు ముఖేష్ అంబానీకి షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా ఆయన సంపద ఆవిరవుతూ వస్తోంది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితా (హురున్ గ్లోబల్ లిస్ట్ 2025)లో ఆయన టాప్ చోటు కోల్పోయారు. గతేడాది కాలంగా రూ. లక్ష కోట్ల మేర కోల్పోవడంతో ఆయన స్థానం కనుమరుగైంది. హురున్ జాబితాలో చోటు కోల్పోయినా కానీ ఆసియాలో మాత్రం టాప్‌లోనే కొనసాగుతున్నారు. 2024లో అంబానీ సంపద 13 శాతం మేర తగ్గగా.. గౌతమ్ అదానీ సంపద మాత్రం 13 శాతం పెరిగింది. టెస్లా సీఈవో మస్క్ 420 బిలియన్ అమెరికన్ డాలర్లతో ప్రపంచ కుబేరు డిగా మరోమారు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అమెజాన్ అధినేత బెజోస్ రెండో ప్లేస్‌లో, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ౩వస్థానంలో కొనసాగుతున్నా రు. 

మొదటి భారతీయ మహిళగా రోష్నీ.. 

ఈ జాబితాలోకి భారత్‌కు చెందిన రోష్నీ నాడార్ ప్రవేశించింది. హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ కుమార్తె రోష్నీ నాడార్ రూ. 3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న మహిళల జాబితాలో చేరారు. ఈ జాబాతాలో ఆమె టాప్ కొనసాగుతు న్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి భారతీయ మహిళ రోష్నీనే కావడం గమనార్హం. అధినేత శివ్‌నాడార్ హెచ్‌సీఎల్ కంపెనీ షేర్లను 47 శాతం రోష్నీకి పంచడంతో సంపద అమాంతం పెరిగింది. ఏడాది కాలంలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 284 మంది బిలియనీర్లు ఉన్నారు. మన దేశ బిలియనీర్ల చేతిలో ఉన్న సంపద మొత్తం అక్షరాలా రూ. 98 లక్షల కోట్లు కావడం గమనార్హం. ‘బిలియనీర్స్ క్యాపిటల్ ఆఫ్ ఆసియా’ టైటిల్‌ను చైనాలోని షాంఘై నగరం దక్కించుకుంది.