calender_icon.png 30 April, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలక్ వాకర్స్ ఆధ్వర్యంలో కూలీలకు అంబలి పంపిణీ

10-04-2025 12:52:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం తిలక్ వాకర్స్ అసోసియేషన్(Tilak Walkers Association) ఆధ్వర్యంలో అడ్డా కూలీలకు అంబలి పంపిణీ చేశారు. 700 మంది కూలీలకు అంబలి పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. రూ 1500 కు వైకుంఠ రథం అందుబాటులో ఉందని, బెల్లంపల్లి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. వైకుంఠ రథం కావాలనుకున్నవారు 9949253573, 9440001309, 9550950950, 98494435337 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. అంబలి పంపిణీ కార్యక్రమంలో తిలక్ వాకర్ అసోసియేషన్ సభ్యులు గైని మల్లేష్, రత్నం రాజన్న, కంటే వాడ నగేష్ కుమార్, గెల్లి జయరాం యాదవ్, ముత్తి వెంకట రాజం, గరిగే రాజకుమార్, తిప్ప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.