calender_icon.png 22 April, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబలి వితరణ కేంద్రం ప్రారంభం

12-04-2025 12:51:13 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు తణుకు సాయి ఆధ్వర్యంలో   కమాన్ కూడలి వద్ద  ‘అంబలి వితరణ కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఇట్టి అంబలి కేంద్ర ప్రారంభోత్సవానికి  ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షులు నగునూరి రాజేందర్  జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ , 48వ డివిజన్ కార్పొరేటర్  దుర్శెట్టి అనూప్ కుమార్ లు హాజరై అంబలి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ యువజన సంఘం అధ్యక్షులు తనకు సాయి కృష్ణ మాట్లాడుతూ వేసవికాలం ముగిసే వరకు సుమారు ప్రతిరోజు 500 మందికి  ఉదయం 9:00 గంటల నుంచి అంబలి వితరణ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి పట్టణ మహిళా సంఘం రావికండి భాగ్యలక్ష్మి ,జిల్లా అధ్యక్షురాలు చకిలం స్వప్న ,యువజన సంఘం జిల్లా అధ్యక్షులు  సాయి కృష్ణ  యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కన్న సాయి, కోశాధికారి సూరజ్ అదనపు ప్రధాన కార్యదర్శి గంప వెంకటేష్, ఉపాధ్యక్షులు ఆకాష్ ,రాహుల్, రాజేష్, కార్యదర్శి సాయి కృష్ణ ,ప్రమోద్ ,యశ్వంత్, సాయి యువజన సంఘం సభ్యులు ,ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు.