11-03-2025 07:56:27 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జాదవ్ అంబాజీ నాయకులు ఉట్నూర్ ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ గా అదనపు బాధితులను ప్రభుత్వం అప్పగించింది. ఉమ్మడి జిల్లాలో సీనియర్ అధికారిగా పేరున జాదవ్ అంబాజీనాయక్ నిర్మల్ జిల్లా అధికారిగా ఇన్చార్జి మంచిర్యాల జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తుండగా తాజాగా ఉట్నూర్ ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్ గా మరో బాధ్యతలను అప్పగించడంతో ఆయన వెంటనే విధుల్లో చేరినట్టు తెలిపారు. ఐటీడీఏ పీవో సమక్షంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు.