calender_icon.png 18 October, 2024 | 8:00 PM

ఇక ఆఫీస్ కి రావాల్సిందే: అమెజాన్

18-10-2024 05:15:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. కరోనా కాలంలో పలు కంపెనీలు తమ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కోవిడ్ తగ్గిపోయిన తర్వాత కొన్ని కంపెనీలు ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పనిచేయాలని ఆదేశించాయి. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి పనిచేస్తున్నారు. తాజాగా అమెజాన్ ఎడబ్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలికి ఆఫీసుకు వచ్చి వారానికి ఐదు రోజలు పనిచేయాలని ఆదేశించారు. ఆఫీసుకు వచ్చి విధులు నిర్వహించని వారు వేరే కంపెనీలకు వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. 

ఇష్టం ఉన్నవారు కార్యాలయానికి వచ్చి పని చేయాలనుకున్నే వారికి వచ్చే ఏడాది జనవరి 2 వరకు అమెజాన్ గడువు విధించింది. అమెజూన్ ఆదేశాలను 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ కంపెనీ వారానికి మూడు రోజలు కార్యాలయానికి రావాలనే విధానాన్ని అమలు చేస్తోంది. కానీ మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని మాట్ గార్మాన్ స్పష్టం చేశారు. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ కొత్త విధానం అమలులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు అమెజాన్ ఎడబ్యూఎస్ సీఈఓ తెలిపారు.