- చలాది పూర్ణచంద్రరావు
తరతరాలుగా అడవులు, కొండలు కోనల్లో నివసిస్తున్న వివిధ తెగలకు చెందిన గిరిపుత్రుల జీవన విధానాల్లో ఆశావహ మార్పులు చోటు చేసుకుంటున్నా యి. ఈ మేరకు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. గడచిన దశాబ్దం పైగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతి ఏటా ఇందుకోసం పలు చర్యలు చేపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ. 13 వేల కోట్లు (గతేడాది కంటే 73.60 శాతం అధికంగా) నిధులు కేటాయించడం విశేషం.
దేశంలోని మొత్తం 63 వేల గిరిజన గ్రామాల్లోని సుమారు 5 కోట్లమంది ఆదివాసీల జీవన స్థితిగతులు మెరుగు పరచట మే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది కేంద్ర ప్రభుత్వం చేబట్టే ఈ అభివృద్ధి చర్యల్లో చెప్పుకోదగిన వాటిల్లో గిరిజన విద్యార్థులకు ‘ఏకలవ్య మోడల్ పాఠశాలలు’ ఒకటి. వీటి సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు దేశంలో కేవ లం 90 పాఠశాలలు మాత్రమే ఉండగా, 2014 నుండి ఇప్పటి వరకు 690 మంజూరైనాయి. వీటిలో 450కి పైగా ఏకలవ్య స్కూళ్లు ప్రారంభించారు. ఆదివాసీ బాలబాలికలకు వారి మాతృభాషలోనే విద్యా బో ధన జరపటం ఒక వరంగానే భావించాలి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం లక్షకుపైగా గిరిజన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు.
10 రెట్లు పెరిగిన ఆదాయ వనరులు
గత ఆర్థిక సంవత్సరం (2023- లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 40 వేలమంది ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించేందుకు ఆమోదం లభించింది. వారి నివాస ప్రాంతాలకు రోడ్లు, సమాచార కనెక్టవిటి, ఆధునిక మౌలిక వసతులు కల్పించి, అటవీ పర్యాటకం ద్వారా ఆదాయం సమాకూర్చేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఇది 2014 బడ్జెట్‌తో పోలిస్తే నేడు పది రెట్లకు పెరిగింది. ఇది వారి అభివృద్ధిపట్ల కేంద్ర ప్రభుత్వానికి వున్న అంకితం భావాన్ని తెలియ చేస్తోంది. అనేక దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద ప్రభావం వల్ల ప్రగతికి ఏ మాత్రం నోచుకోని అటవీ ప్రాంతాల్లోని వేలాది గిరిజన గ్రామాలు ఇప్పుడు ఆధునిక సమాచార వ్యవస్థ 4+ కనెక్టివిటీని పొందడంతో ప్రధాన జీవన స్రవంతిలో కలిసేలా పరిస్థితి మెరుగుపడిందని చెప్పాలి.
ప్రతి ఏటా కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధీనంలోని ‘ట్రైఫెడ్’ ద్వారా ‘ఆది మహోత్సవ్’ గిరిజన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తద్వార వారి వ్యవస్థాపకత, సంస్కృతి, హస్తకళలు, వంటకాలు, వాణిజ్య వేడుకల మేళవింపు జరుగుతున్నది. అయి తే, ప్రభుత్వం మరొక బృహత్తర కార్యక్రమం ‘విశ్వకర్మ’ పథకం పేరిట చేపడుతు న్నది. దీనిద్వారా 1000 మంది గిరిజన కళాకారులకు భాగస్వామ్యం కల్పించి సమున్నతమైన గిరిజనుల వైవిధ్యం, చలనశీలత లను ప్రతిబింభించేలా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించేందుకు సాంప్రదాయ గిరిజన కళాకారుల బృందాలను తయారు చేస్తారు. వారు వివిధ చోట్ల ప్రదర్శనలిస్తారు.
వీటితోపాటు జాతీయ స్థాయిలో ‘వన్ ధన్ ’ వికాస్ కేంద్రాలను మూడు వేలకు పైగా ఏర్పాటు చేసి, 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతుగా ధర (ఎంఎస్‌పీ )కల్పించనున్నారు. దీంతో 50వేలకు పైగా వున్న ఆదివాసీ స్వయం సహాయక బృందా ల ద్వారా లక్షలాది మంది గిరిజనులు లబ్ధి పొందగలరు. ఇంతేకాక, ఇప్పటివరకు 1972 అటవీ సంరక్షణ చట్టం నియంత్రణలో వున్న వెదురుని ఆ చట్టం నుండి మిన హాయించి గడ్డిజాతిలో చేర్చి గిరిజనులకు వెదురు నేరుగా అమ్ముకునే హక్కు కల్పించనున్నారు. ఫలితంగా గిరిజనుల్లో సంతృ ప్తి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
10 ఎకరాల వరకు పట్టా భూములు
ఐక్యరాజ్యసమితి 1994లో జారీ చేసిన ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఆగస్టు 9న ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ నిర్వహిస్తున్నా రు. కాగా, ఏళ్ల తరబడి అనేక ఆదివాసీ హక్కులకోసం చేసిన ఎన్నో పోరాటాల అనంతరం వారికి అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ 2006లో చట్టం చేశారు. దాని ప్రకారం అటవీభూమిపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికీ 10 ఎకరాల వరకూ పట్టా ఇవ్వవచ్చు. వారిపైగల అటవీ, వేట సంబంధ కేసులను ఎత్తి వేయాల్సి ఉంది. మన రాష్ట్రంలో దీని అమలు 2006లో ప్రారంభమైనా అరకొరగా అమలు జరిగిందనేది గిరిజన నేతల ఆరోపణ. ఇన్ని చట్టాలు ఉన్నా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఆదివాసీ తెగలు తమ సంప్రదాయపు భూముల నుంచి, అటవీ ప్రాంతాల నుంచి నెట్టివేయబడుతున్నారు. మన రాష్ట్రంలో 1/70 చట్టం అమలులో ఉంది. గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలి. గిరిజనేతరులకు షెడ్యూల్ భూమిపై ఎలాంటి హక్కూ లేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొన్ని గిరిజన ప్రధాన కేంద్రా ల్లో వాణిజ్యానికి పెట్టుబడులు లేని సంప్రదాయక గిరిజన భూములను కొందరు గిరిజనేతరులు బినామీల పేర్లతో ఆక్రమించుకున్న సంఘటనలు ఉన్నాయి. 1/70 చట్టం ద్వారా సంక్రమించిన నిబంధన సడలింపుతో కొన్ని మిషనరీ విద్యాసంస్థలకు గిరిజన విద్య పేరుతో 99 ఏళ్ళకు లీజ్‌కి ఇవ్వడమేకాక ఆ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోంది. కాని, ఇలాంటి విద్యాసంస్థల ప్రొద్బలంతో విద్యతోపాటు అన్య మత ప్రచారం పెరిగిందనే ఆరోపణలు వున్నాయి. అయితే, ఈ మత ప్రచారంలో భాగంగా మన్యంలోకి వచ్చే పాస్టర్ల ప్రమేయంతో దారుణమైన మద్యపాన అలవా టుకి బానిసలైన గిరిజనుల సంఖ్యకూడా చాలావరకు తగ్గిందనే సంతృప్తి వారిలో కనిపిస్తున్నది.
ఈ గిరిజన ప్రాంతాలలోని భూములు ప్రైవేటు, ఇతరులకు లీజుకి ఇచ్చే బదులు ఐటీడీఏ ద్వారానే ప్రభుత్వం జూనియర్ కాలేజీలను పెట్టవచ్చు లేదా తాము నడుపుతున్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించే వీలుందని గిరిజన నేత, ‘శ్రీ పేరంటలమ్మా గిరిజన లేబర్ కాంట్రాక్టు ఎయిడెడ్ సొసైటీ’ స్వచ్చంద సంస్థ చీఫ్ ప్రమోటర్ బిట్టా వెంకటేశ్వరరావు (పూర్వపు ఖమ్మం జిల్లా) అభిప్రాయ పడటంలో నిజముందని చెప్పాలి. 75 ఏళ్ళ స్వాతంత్య్రంలో తమ కోసం, తమ ఆదివాసీ బిడ్డల అభివృద్ధి కోసం ఎన్నడూ లేని విధంగా పదేళ్లుగా ఏ ఏటికా ఏడు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులు జరుపు తూ, చేయూతనిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి యావత్ గిరిపుత్రులు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
సెల్: 9491545699