29-03-2025 06:37:42 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల గ్రామ దేవతలకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవతలకు పంచామృతాలతో అభిషేకం, దేవతామూర్తులను పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.