కామారెడ్డి, సెప్టెంబరు 2 (విజయక్రాంతి): ఏడాది పొడవున రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పశువులకు పోలాల అమవాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కువగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని గ్రామా ల్లో జరుపుకొంటారు. ఈ సందర్భంగా ఎడ్లకు, ఆవులకు పోలెలు తయారు చేసి తినిపించారు.