calender_icon.png 23 September, 2024 | 5:55 PM

ఐఏఎఫ్ చీఫ్‌గా అమర్‌ప్రీత్‌సింగ్

22-09-2024 12:05:30 AM

30న బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత వాయుసేన (ఐఏఎఫ్) కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్ మార్షల్‌గా సేవలందిస్తున్నారు. ప్రస్తుత ఎయిర్‌చీఫ్ మార్ష ల్ వివేక్‌రామ్ చౌదరి పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. అదే రోజు అమర్‌ప్రీత్ బాధ్యతలు చేపడుతారని శనివారం కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఐఏఎఫ్‌కు అమర్‌ప్రీత్ 47వ వైస్ చీఫ్ మార్షల్‌గా గత ఏడాది ఫిబ్రవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1984లో ఐఏఎఫ్‌లో చేరారు. ఆ ఏడాది డిసెంబర్ 21న ఆయన ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌లో కీలకంగా పనిచేశారు. మిగ్‌హా స్కాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా సేవలందించారు. 2019లో అతి విశిష్ఠ సేవా మెడల్, 2023లో పరమ్ విశిష్ఠ సేవా మెడల్‌ను అందుకొన్నారు.