calender_icon.png 16 November, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరన్ డైరెక్టర్‌కు ఫ్యాన్‌గా మారిపోయా

07-11-2024 12:00:00 AM

శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్, మహేంద్రన్ నిర్మించారు. సుధాకర్‌రెడ్డి, నిఖితరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా అక్టోబర్ 31న విడుదల చేశారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ బుధవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘ఒక దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను బ్లెండ్ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్ రాజ్‌కుమార్ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాతో డైరెక్టర్‌కు ఫ్యాన్‌గా మారిపోయా. సాయిపల్లవి వర్క్‌కి, డాన్స్‌కి నేను పెద్ద అభిమానిని. ఆమెతో ఒక సినిమాలో డాన్స్ చేయాలి. అది నాకు గ్రేట్ చాలెంజ్. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో శివకార్తికేయన్ మా తెలుగు హీరో, తెలుగు అబ్బాయి అయిపోయారు’ అన్నారు.

హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ‘ఆంధ్ర, తెలంగాణలో చాలామంది సినిమా చూసి ఎమోషనల్‌గా ఏడుస్తున్న వీడియోస్ చూశా. మేజర్ వరదరాజన్ క్యారెక్టర్ చేయడానికి ముఖ్య కారణం మా నాన్న. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్. ఆయనకు, ముకుంద్ క్యారెక్టర్‌కు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ మూవీ మా నాన్నకు ఒక ట్రిబ్యూట్. ఈ సినిమాకి ఏ అవార్డు వచ్చినా అది ఫస్ట్ రాజ్‌కుమార్‌కి దక్కాలి. సాయిపల్లవితో కలిసి చేసిన ఫస్ట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావడం ఆనందాన్నిచ్చింది’ అని తెలిపారు.

‘ఈ సినిమాకి తమిళ్‌లో ఎంత అప్రిసియేషన్ వచ్చిందో తెలుగు నుంచి కూడా అంత గొప్పగా అప్రిసియేషన్ వచ్చింది. ఎక్కడైనా మంచి సిని మా ఉందంటే తెలుగు ఆడియన్స్ గొప్పగా ఆదరిస్తారు. మీరు ఇస్తున్న ప్రేమతో ఇంకా  మంచి పాత్రలు చేయాలనే ఎనర్జీ వస్తుంది. మీ ప్రేమకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని హీరోయిన్ సాయిపల్లవి అన్నారు. మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ..

‘సౌత్‌లో ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల్ని ప్రేక్షకులు అంతగా ఆదరించరనే ఒక థియరీ ఉంది. ఆ థియరీని అమరన్ బ్రేక్ చేసింది’ అని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ సుధాకర్‌రెడ్డి, లిరిక్ రైటర్ కృష్ణకాంత్, డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి పాల్గొన్నారు.