calender_icon.png 6 November, 2024 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమన్ ఒక్కడే

13-05-2024 12:00:00 AM

ఒలింపిక్ క్వాలిఫయర్స్

ఇస్తాన్‌బుల్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో భారత రెజ్లర్లు మరోసారి విఫలమయ్యారు. మెన్స్ ఫ్రీస్టుల్ విభాగంలో అమన్ షెరావత్ (57 కేజీలు) ఒక్కడే పారిస్ బెర్తు దక్కించుకున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అమన్ 12 కొరియాకు చెందిన చోంగ్‌సాంగ్ హాన్‌ను చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఒలింపిక్ బెర్తు కచ్చితంగా సాధిస్తాడనుకున్న సుజీత్ కల్కల్ నిరాశ పరిచాడు. ఆదివారం 65 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సుజీత్.. అలెన్ రెథర్‌ఫోర్డ్ చేతిలో ఓటమిని చవిచూశాడు. మరో బౌట్‌లో జైదీప్ (74 కేజీలు) తొలుత రెపీచేజ్ రౌండ్‌లో విజయం సాధించినప్పటికి కాంస్య పతక పోరులో సోనెర్ డెమిర్తస్ చేతిలో 1 ఓటమి పాలయ్యాడు.