- సెమీస్‌లో ఓడిన భారత రెజ్లర్
- నేడు కాంస్య పతక పోరు
పారిస్: ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ ఫైనల్ చేరే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. గురువారం జరిగిన పురుషుల ఫ్రీస్టుల్ 57 కేజీల విభాగం సెమీఫైనల్లో అమన్ 0 తేడాతో జపాన్ రెజ్లర్ హిగుచి చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌కు వరకు ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా కోల్పోని అమన్ అదే జోరును సెమీస్‌లో చూపడంలో విఫలమయ్యాడు. సెమీస్‌లో విఫలమైనప్పటికీ అమన్ కాంస్య పతక పోరుకు సిద్ధమయ్యాడు. నేడు జరగనున్న కాంస్యం పోరులో అమన్ ప్యూర్టెరికో రెజ్లర్ క్రజ్ డరియాన్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు.
ప్రత్యర్థులకు చుక్కలే..
సెమీస్‌లో ఓడినప్పటికీ అమన్ షెరావత్ తన ఒలింపిక్స్ జర్నీని ఘనంగా ఆరంభించాడు. ముందుగా ప్రిక్వార్టర్స్‌లో అమన్ 10 తేడాతో వాద్లిమిర్ (నార్త్ మాసిడోనియా)ను చిత్తు చేశాడు. ప్రత్యర్థిపై తొలి బౌట్ నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్ వాద్లిమిర్‌ను రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్లు సాధించాడు. రెండో బౌట్‌లోనూ భారత రెజ్లర్‌కు వ్లాదిమిర్ కనీస పోటీ ఇవ్వడంలో విఫలమయ్యాడు. దీంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన అమన్ అక్కడా అదరగొట్టాడు. క్వార్టర్స్‌లో అమన్ 12 తేడాతో అబాకరోవ్ (అల్బేనియా)పై విజయం సాధించాడు.
అబాకరోవ్‌ను ఐదుసార్లు కిందపడేసి 10 పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు. చివర్లో మరో పాయింట్ సాధించిన అమన్ సుపీరియర్ టెక్నికల్ పద్దతిలో ఘన విజయాన్ని అందుకొని సెమీస్‌కు దూసుకొచ్చాడు. ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో ప్రత్యర్థులను పని పట్టిన షెరావత్ సెమీస్‌లో పూర్తిగా తేలిపోయాడు. వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుతో భారత్‌కు పతకం చేజారింది. 2008 నుంచి రెజ్లింగ్‌లో మనకు కనీస ఒక పతకమైనా వస్తుంది. నేడు జరగనున్న కాంస్యం పతక పోరులో అమన్ తన పట్టును చూపించి పతకం సాధించి వినేశ్ బాధను మరిచిపోయేలా చేయాలని ఆశిద్దాం.