calender_icon.png 18 January, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమన్ సాధించాడు

10-08-2024 04:06:27 AM

  1. కాంస్య పతకం నెగ్గిన భారత రెజ్లర్
  2. భారత్ ఖాతాలో ఆరో పతకం

ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్‌లో భారత్ నుంచి పురుషుల విభాగంలో అర్హత సాధించిన ఏకైక రెజ్లర్ అమన్ షెరావత్ అంచనాలు అందుకున్నాడు. ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికీ కాంస్య పతక పోరులో మాత్రం అమన్ తన పట్టును చూపించాడు. ప్రత్యర్థిని తన కబంద హస్తాల్లో బందించి ఊపిరాడనీయకుండా చేసి కంచు మోగించాడు.  2008 ఒలింపిక్స్ నుంచి కుస్తీ పోటీల్లో మనకు ఒక్క పతకమైనా వస్తుంది. ఈసారి రెజ్లింగ్‌లో ఆ ముచ్చట తీరకుండానే ముగుస్తుందా అన్న తరుణంలో అమన్ షెరావత్ పతకం సాధించి ఔరా అనిపించాడు. రెజ్లింగ్‌లో భారత్ నుంచి రితికా హుడా మాత్రమే బరిలో ఉన్న వేళ ఆమె కూడా పతకం తేవాలని ఆశిద్దాం.

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. పురుషుల రెజ్లింగ్ ఫ్రీస్టుల్ 57 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అమన్ షెరావత్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన కాంస్య పతక పోరులో అమన్ 13 తేడాతో ప్యూర్టెరికో రెజ్లర్ క్రుజ్ డారియన్‌ను చిత్తుగా ఓడించాడు. తొలి బౌట్‌ను కాస్త నెమ్మదిగా ఆరంభించిన అమన్.. ఆ తర్వాత ప్రత్యర్థిపై పట్టు సాధించాడు. తొలి బౌట్ ముగుస్తుందనగా ఆరు పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలిచాడు. రెండో బౌట్‌లో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వని అమన్ మరో 7 పాయింట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచి విజేతగా నిలిచాడు.

అంతకముందు గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో జపాన్ రెజ్లర్ హిగుచి చేతిలో 0 తేడాతో షెరావత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే  ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌లో మాత్రం ప్రత్యర్థులను సున్నా పాయింట్లకే మట్టి కరిపించాడు. అదే ఊపులో సెమీస్ కూడా గెలిచి ఫైనల్లో అడుగుపెడతానుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే కాంస్యంతో అమన్ పురుషుల విభాగం నుంచి భారత్‌కు పతకం అందించడంలో విజయవంతమయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో మొత్తం ఆరు గురు రెజ్లర్లు బరిలోకి దిగారు. వారిలో అం తిమ్, నిషా, అన్షు మాలిక్‌లు ఓటమి పాలవ్వగా.. ఫైనల్‌కు దూసుకొచ్చిన వినేశ్ ఫొగా ట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.

ఇక మహిళల ఫ్రీస్టుల్ 76 కేజీల విభాగంలో రితికా హుడా నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అమన్ కాంస్యంతో ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత పత కాల సంఖ్య 8కి చేరింది. కాగా పురుషుల రెజ్లింగ్‌లో భారత్ నుంచి ఒలింపిక్ పతకం సాధించిన ఆరో వ్యక్తిగా అమన్ షెరావత్ నిలిచాడు. అంతకముందు కేడీ జాదవ్, సుశీ ల్ కుమార్, యోగేశ్వర్ దత్, రవి కుమార్ , బజరంగ్ పూనియాలు ఉన్నారు.