calender_icon.png 19 November, 2024 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనేమైనా పబ్లిక్ ప్రాపర్టీనా?

26-08-2024 12:10:25 AM

సెలబ్రిటీలకు ఉండే క్రేజీ వేరు. సినీ అభిమానులు కనిపిస్తేనైతే.. సెల్ఫీ ప్లీజ్ అని అడగకుండా ఉండలేరు. కెమెరా మెన్ల తీరు మరింత దూకుడుగా ఉంటుంది. అయితే, అభిమానులతో సెల్ఫీలు దిగే విషయంలో సెలబ్రిటీలందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు ఇష్టంగా సమయం కేటాయిస్తే.. మరికొందరు తుర్రుమని తప్పించుకోజూస్తారు. ఇంకొందరు సెల్ఫీలు గిల్ఫీలేవీ వద్దని మొహం మీదే చెప్పేస్తుంటారు.

నటి తాప్సీ కూడా ఈ బాపతే! ఇటీవల గట్టిగా కేకలు వేస్తూ, పేరు పెట్టి పిలుస్తూ ఫొటోల కోసం వెంటపడిన ఫొటోగ్రాఫర్లపై కోపగించుకుందీ బ్యూటీ. తాజాగా ఒక భేటీలో ఫొటోగ్రాఫర్లతో గొడవ గురించి స్పందిస్తూ.. ‘నేను సెలబ్రిటీనే కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదు కదా! ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఈ విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. ఎవరైనా నాపై అరిస్తే ఊరుకోను. వెంటనే తిరిగి సమాధానం ఇచ్చేస్తా.

కెమెరాలతో నాపైకి దూసుకురావటం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటీ..? ఇది కరెక్ట్ కాదు. మొదట నేను అమ్మాయిని. తర్వాతే నటిని. ఇలా చెప్తున్నందుకు నేనీ వృత్తికి తగిన వ్యక్తిని కాదని భావించేవాళ్లూ ఉంటారు.. అయితే నటనే నాకు నచ్చిన వృత్తి’ అని చెప్పుకొచ్చింది తాప్సి.