calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పది' విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించిన పూర్వ విద్యార్థులు..

18-03-2025 07:20:54 PM

వైరా (విజయక్రాంతి): మండల పరిధిలోని పాలడుగు ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థులు (2000-2001) పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్ణయించబడుతుందన్నారు. విద్యార్థులను ప్రయోజకులను చేయడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషిస్తారన్నారు. లక్ష్యసాధనకు ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు మోదుగు వినోద్ కుమార్, కాకాని వాణి, షేక్ పర్వీన్, పి.కుష్మావతి, ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియేల్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.