16-03-2025 10:49:06 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని 3వ జోన్ ఆదర్శ విద్యానికేతన్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఆదివారం 2002-2003 బ్యాచ్ కి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరి పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 22 సంవత్సరాల తర్వాత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి ఎక్కడెక్కడో స్థిరపడ్డ బాల్య స్నేహితులందరూ విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకొని సందడి చేశారు. గత స్మృతులను స్మరించుకుంటూ, పాఠశాలలో చేసిన అల్లరి పనులను తలుచుకున్నారు.
సుదీర్ఘ విరామం అనంతరం బాల్య మిత్రులు అందరూ ఒకచోట కలవడంతో ఆప్యాయంగా పలకరించుకొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా విద్యాబుద్దులు నేర్పి తమ జీవితాలను మలుపు తిప్పిన గురువులను ఈ సందర్బంగా ఘనంగా సన్మానించారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు తరచూ జరపుకోవాలని నిర్ణయించారు. ఆత్మీయ సమ్మేళనం విజయవంతానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భీమ్ రెడ్డి సమ్మిరెడ్డి, ఎడ్ల శంకర్, జంగిలి సాంబమూర్తి, హైదర్, వెంకటేశ్వర్లుతో పాటు పూర్వ విద్యార్థులు తోకల నరేష్, వెంకటేష్, రాకం సంతోష్, మంద సురేష్, రవీందర్, రమేష్, సంపత్, విజయ్, సునీత, కవిత, లత, రజితలు పాల్గొన్నారు.