27-04-2025 04:05:25 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణంలోని శ్రీ రేవతి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న 2003-2004 బ్యాచ్ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్స్ లో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యా, బుద్ధులు నేర్పిన అధ్యాపకులతో మనసు విప్పి మాట్లాడుకున్నారు. అనంతరం అధ్యాపకులను ఘనంగా సన్మానించి ఆశీస్సులు పొందారు. పూర్వ విద్యార్థులు సందర్భంగా ఆటపాటలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు శోభ, ఉష, విజయ్ కుమార్, శ్రీనాథ్, హన్మాన్ చారి, శ్రీనివాస్, సంతోష్, స్వప్నిల్ ఆర్.మల్లేష్, హరీష్, రాజేష్, నారాయణ, నితేష్, దాస్, కిరణ్, ఇమ్రాన్, శారద, ముబీన, వీణ, సారిక, శ్వేత, సౌమ్య తదితులున్నారు.