09-03-2025 10:02:23 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 1999-2000 సంవత్సరం కు చెందిన పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు కలుసుకొని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంపత్, శ్రీధరచారి, శంకరయ్య, అశోక్ రెడ్డి, రవిందర్ రావు, దర్మలత, వాణిశ్రీ, విద్యార్థులు రాగుల సతీష్, మెట్టు తిరుపతి, తూముల రాజయ్య, బొడ్డు పల్లి సంజీవ్, ఈద మల్లేశ్వరి, గిరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.