23-03-2025 08:38:31 PM
పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త సుభాష్ రెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981 82 బ్యాచ్ పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థి ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రస్తుత ప్రభుత్వ హైస్కూల్ నిర్మాణదాత సుభాష్ రెడ్డి పాల్గొని తమ చిన్ననాటి మిత్రులతో కలిసి జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రస్తుతం వారు ఉంటే నవ్వుదామని వేడుక ద్వారా తెలుసుకున్నారు చదువుకున్న రోజుల్లో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.