calender_icon.png 19 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

14-04-2025 01:52:44 AM

హనుమకొండ, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పదో తరగతి వరకు కలిసి చదువుకున్న విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విడిపోయి 21 ఏళ్ల తర్వాత కలుసుకున్న వరంగల్ జిల్లా చెన్నారావుపేట లో ఆదివారం జరిగింది.

సిద్ధార్థ గురుకుల విద్యాలయం పాఠశాలలో 2003- 2004 గో పదవ తరగతి పూర్తి చేసిన 40 మంది విద్యార్థులు పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తమకు విద్య నేర్పిన గురువులు కంది గోపాల్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్, రాములు, యాకూబ్ రెడ్డి, మధు, రవీందర్, భారతి, సుజాత లను ఘనంగా సత్కరించారు. అపూర్వ సమ్మేళన సందర్భంగా గుర్తుండే విధంగా జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సదానందం, చందు, గౌతమ్, క్రాంతి, రమేష్, సురేష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజేష్, శివ తదితరులు పాల్గొన్నారు.