31-03-2025 08:04:02 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2008-09 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణలో సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యాబుద్దులు నేర్పిన పాండురంగచారి, పాషా, ఆనంద్ కిషోర్, సుబ్రహ్మణ్య, ఆహ్వానించి ఆశీర్వాదం పొందారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయుల విద్యాబోధనను గుర్తు చేసుకొని వారిని కొనియాడారు. ఆ తర్వాత ఉపాధ్యాయులను పూలమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.