13-04-2025 08:22:41 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాలలోని బాలుర ఉన్నత పాఠశాలలో 2001-2002 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆది వారం జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. గురువులను శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించారు. మిత్రులందరు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకొని ఆనందంగా ఆటపాటలతో గడిపారు. ఈ సమ్మేళనంలో ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు భీరయ్య, కన్నయ్య, సత్యనారాయణ, నర్సయ్య, సత్తయ్య, సుబ్బలక్ష్మి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.