చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో 1970-1971 బ్యాచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు వారణాసి చంద్రయ్య, అడ్వాల లచ్చయ్య, పులి రామన్న, బోదు చంద్రయ్య, సాదిక్ అలీలను పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ... గురువులు నేర్పిన విద్యా బోధన, క్రమశిక్షణతో తమతోపాటు విద్యనభ్యసించిన అందరూ కూడా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డామని వారు నేర్పిన విద్య బోధనల ద్వారానే సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభించాయి. అందుకే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పురాణం శంకర్, టంకశాల రవీందర్ , మహావాది రమేష్ , సత్యనారాయణ, రుద్రభట్ల రంజన్, గన్ను పురుషోత్తం, గన్ను శ్రీరాములు, రాజేశ్వర్ రెడ్డి, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.