14-04-2025 12:00:00 AM
50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు
సూర్యాపేట,ఏప్రిల్13(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 1973-75 విద్యా సంవత్సరం లో ఇంటర్మీడియట్ బైపిసి కి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకొని తమ చిన్న నాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
జూనియర్ కళాశాల 50 ఏళ్ల క్రితం చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని సరదాగా గడిపారు. ఒకరినొకరు తమ బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమా నికి హాజరైన పూర్వ విద్యార్థి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్దేల్లి మురళి మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం చదువుకున్న తాము ఈ వయసులో కలుకోవడం పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, శ్యాంసుందర్, అశోక్, రాజేంద్రప్రసాద్, నరేందర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, అశ్విని కుమార్, నరసింహారావు, డాక్టర్ రామచంద్రరావు, జగన్, పృథ్వి రంజన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.