calender_icon.png 19 January, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

19-01-2025 06:01:38 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాఠశాలలో 2004-05 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఎక్కడెక్కడో స్థిర పడిన వారు 20  సంవత్సరాల తర్వాత చిన్న నాటి స్నేహితులను కలుసుకొని చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఆప్యాయంగా పలకరించుకొని యోగ క్షేమాలు అడిగి తెలుసు కున్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదివడం తమ అదృష్టమని, పాఠశాల లో విద్యతో పాటుగా సంస్కారం కూడ నేర్పించారని గురువులను కీర్తించారు. బాల్య మిత్రులందరిని కలవడంతో తిరిగి బాల్యంలోకి వెళ్లినట్లు అయిందని పాఠశాల  జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు.అనంతరం పూర్వ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమం లో శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలల విభాగ్ కార్యదర్శి దహేగాం గోవింద రావు, అకాడమిక్ ఇన్చార్జి పూదరి సత్యనారాయణ, జిల్లా సహా కార్యదర్శి సూరం లక్ష్మీనారా యణ, పాఠశాల కార్యదర్శి దాసరి రాములు, పాఠశాల ప్రధాన ఆచార్యులు కట్ట శిరీష, కోశాధికారి డి సారయ్య, పూర్వ ఆచార్యులు సారంగ పాణి,  వై సత్యనారాయణ, పద్మావతి, రామకోటేశ్వరి, శారద, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.