calender_icon.png 19 January, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం జయప్రదం చేయాలి

19-01-2025 08:04:31 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సరస్వతి శిశు మందిర్ లో చదివిన పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం జయప్రదం చేయాలని  కమిటీ సభ్యులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 16న ఆదివారం శిశు మందిర్ ఆవరణలో పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 500 మంది  పూర్వ విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. స్థానికంగా ఉన్న పూర్వ విద్యార్థులు తమతో చదువుకున్న విద్యార్థులకు సమ్మేళనం గురించి తెలియజేసి అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ సమావేశంలో మహా సమ్మేళనం కమిటీ ఉపాధ్యక్షుడు వాసుదేవన శైలేష్, కార్యదర్శి ఇరుకుల్ల శ్రీనాథ్, సమన్వయ కమిటీ సభ్యులు నాగుల శ్రీనివాస్ సమన్వయ, శ్రీ రాం సత్యనారాయణ, సిద్ధంశెట్టి కృపాల్, ప్రధానోపాచార్యులు గుండేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.