calender_icon.png 28 April, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

27-04-2025 08:10:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిరి బాంకెట్ హాల్లో ఎస్ఆర్ కే 1998-99 పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పూర్వ‌ విద్యార్థులంతా 26 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకుని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన బడి, పరిసరాలు చూసి భావోద్వేగానికి గురయ్యారు. వారి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో పంచుకున్నారు.

ఆనాటి కాలంలో అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్న నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణంగా ఉందని గురువులు అన్నారు. 26 ఏళ్ల తర్వాత కూడా తమను గుర్తించుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ, చదువుతో ఈరోజు వివిధ స్థాయిలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆటలు పాటలతో పూర్వ విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, జీవితంలో ఇది ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుందని అన్నారు.