23-03-2025 05:13:05 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): వారంతా కలిసి 50 సంవత్సరాల క్రితం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కలిసి చదువుకున్నారు. రాయపోలు మండలం వడ్డేపల్లి గ్రామంలో 1972-75 సంవత్సరంలో సిద్దిపేటలో డిగ్రీ చదువుకున్న పూర్వ విద్యార్థులంతా వడ్డేపల్లిలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని, తమ అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకున్నారు. అలాగే తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ... 50 సంవత్సరాలు డిగ్రీ చదువుకున్న వారందరినీ గుర్తుంచుకొని కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి, గాల్ రెడ్డి, నాగభూషణం, అంజయ్య, జయసూర్య, రామచందర్ రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.