calender_icon.png 31 January, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

29-01-2025 01:16:10 AM

 ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

 ఆమనగల్లు, జనవరి 28 (విజయ క్రాంతి) : ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కల్వకుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.... సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి  రూ.500 కోట్ల నిధులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు.

ఇటీవల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ ఆర్ ఎం గ్రాంట్ క్రింద రూ.15. 59 కోట్లు  మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వివరించారు. మంగళవారం ఆమనగల్లు  మండల కేంద్రంలో  ఒక ఫంక్షన్ హాల్ లో  స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.3.10 కోట్ల రూపాయలు మంజూరయని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను  తూ.చ తప్పకుండా అమలు చేస్తుందన్నారు. పథకాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు  ఆనందంగా ఉండాలని ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరికి  సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత తమదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే  ప్రతిపక్షాలు కళ్ళు మండుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వంలో అర్హులకు  పథకాలు అందలేదన్నారు. నియోజకవర్గం లో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే  పేద ప్రజలకు అమలు చేస్తున్న  అభివృద్ధిని స్వాగతించాలన్నరు.

ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని... ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు, పథకాల అమలు తీరుపై  విమర్శలు గుప్పించి ప్రజల్లో పలుచన కావద్దన్నారు. కార్యక్రమంలో ఆమనగల్ వ్యవసాయ మార్కెట్  వైస్ చైర్మన్  గుడూరు భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, యాట నరసింహ, భాస్కర్ రెడ్డి, హనుమ నాయక్, జగన్, ప్రభాకర్ రెడ్డి, బిచ్చ నాయక్, మంగ్లీ రాములు, మానయ్య పాల్గొన్నారు.