ఎంపీ గోడం నగేష్
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 14 (విజయక్రాంతి): జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా నని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ నేత అరిగెల నాగేశ్వర్‌రావు అధ్వర్యంలో ఆదివారం పార్టీ నాయకులతో నిర్వహించిన ఎంపీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. సభలో పార్టీ నాయకులు విజయ్, విశాల్, మల్లికార్జున్ యాదవ్, సతీష్‌బాబు పాల్గొన్నారు.