calender_icon.png 3 April, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ప్రత్యామ్నాయంగా అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించాలి

29-03-2025 12:00:00 AM

జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, మార్చి -28 ( విజయక్రాంతి ):-ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వ్యవ సాయ ప్రాథమిక సహకార సంఘాలు ఆశించిన రీతిలో పని చేయడం లేదని అన్నారు.

రైతులకు సరైన సమయంలో తక్కువ వడ్డితో పెట్టుబడి అందించడం, రైతుల నుంచి డిపాజిట్ సేకరణ జరగాలని అన్నారు. ప్యాక్స్ లో ఉన్న సభ్యులు యాక్టివ్ గా ఉండేలా చూడాలని అన్నారు. ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక చేయాలని అన్నారు.

జిల్లాలో ఎన్ని ప్యాక్స్ సరిగ్గా పని చేస్తున్నాయో వివరాలు సేకరించి రిపోర్ట్ అందించాలని అన్నా రు.ప్యాక్స్ ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులు, ఫిష్ ఫార్మింగ్, ఫిష్ పాండ్స్, ప్రత్యామ్నాయ పంటల సాగు వంటి అంశాల పై అవగాహన కల్పించేందుకు సమావేశాల నిర్వహణ షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ ఎల్. సుజిత్ కుమార్, జిల్లా కో ఏ ఆపరేటివ్ అధికారి జి. గంగాధర్, జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా మత్స్య శాఖ అధికారి జి. శివ ప్రసాద్, జిల్లా పశు సంవర్థక శాఖ ఏ.డి. డాక్టర్ కే. శ్రీరమణి, డిసిసిబి సిఈఓ ఎన్.వి. ఆదిత్య, సంబంధిత ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.