calender_icon.png 29 November, 2024 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్బుకు బదులుగా!

26-11-2024 12:00:00 AM

చలికాలం రాగానే చర్మం పొడిబారడంతో పాటు నిర్జీవంగా, సాగి నట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్‌లో సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది.  సబ్బుకు బదులుగా ఇంట్లోనే కొన్ని పదార్థాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. అవేంటో చూద్దాం.. 

*  పచ్చిపాలు ఒక అద్భుతమైన కండిషనర్. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శు భ్రపరుస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. 

* కాటన్ తీసుకుని పచ్చిపాలలో ముంచాలి. దీన్ని ముఖంపై సున్నితంగా అప్లు చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. 

* తేనె అనేది సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. ఒక కప్పులో కొద్దిగా తేనెను తీసుకుని ముఖంపై అప్లు చేసి.. మృదువుగా మసాజ్ చేసి 5 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. 

* ఒక చెంచా పెరుగును ఒక చెంచా శనగ పిండిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లు చేసి పది నిమిషాలు ఉంచాలి. తర్వాత సున్నితంగా రుద్ది కడిగేస్తే సరిపోతుంది.