24-03-2025 12:41:42 AM
విజయవంతం చేయాలని తుడుమ్ దెబ్బ పిలుపు
మహబూబాబాద్. మార్చి 23(విజయక్రాంతి): ఆదివారం నాడు పాఖల కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పో రాట సమితి తుడుందెబ్బ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పాల్గొని మాట్లాడారు.
అణగారిన వర్గాలకు ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగాలని, ఆదివాసీ హక్కులు, చట్టాలు అమలు చేయడానికి పోరాటమే శరణ్యమని నాడు కుంజ రాము సాయుధ పోరాట బాటను ఎంచుకొని అశువులు బాసిన ఆదివాసీ వీరు డు, ధీరుడు. ఆయన మరణించి నేటికీ 20 సంవత్సరాలు అవుతోందన్నారు.
ఆయన మరణించి నాటి నుండి ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని తుడుందెబ్బ నిర్వహిస్తోందని అందులో భాగంగానే మార్చి 27న నిర్వహించే వర్ధంతి కార్యక్రమా న్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బుర్క యాదగిరి, మల్లెల రాము, జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం, అలెం కృష్ణ, సమ్మయ్య, కుంజ పాపయ్య పాల్గొన్నారు.