calender_icon.png 27 April, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఈ ప్రదేశాలను కూడా సందర్శించండి

27-04-2025 12:01:43 AM

ఎక్స్‌లో కేటీఆర్

హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ పర్యటన వస్తున్న రాహుల్ గాంధీ తాను సూచించే క్రింది ప్రాంతాలను కూడా సందర్శించాలని కోరుతున్నానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. లగచర్ల గ్రామం, సుంకిశాల, ఏదైనా హైడ్రా కూల్చివేత సైట్, మూసీ కూల్చివేత స్థలం, హెచ్‌సీయూ కంచగచ్చిబౌలికి వెళ్లాలని ఆయన ఎక్స్ వేదికగా చెప్పారు. ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించిన 100 మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల్లో ఎవరినైనా, ఆత్మహత్యలు చేసుకున్న500కు పైగా రైతుల కుటుంబాల్లో ఎవరైనా, కూలిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, ఫోర్త్‌సిటీ బ్రదర్ సిటీ, అశోక్‌నగర్‌లో 1 సంవత్సరంలో 2లక్షలకు పైగా ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ తెచ్చిన విధ్వంసం గురించి మీకు అద్భుతమైన సమయం ఉంటుందని ఆశిస్తున్నట్లుగా కేటీఆర్ అన్నారు. 

రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ : ఎమ్మెల్సీ కవిత

రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో వచ్చారని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, బులోడజర్లు పెట్టి పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్‌సియూలో చెట్లు పీకేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ రాలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శనివారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ రాహాల్ గాంధీ ఎలక్షన్ గాంధీ అని ఆమె విమర్శించారు. మా మీద ఉన్న కేసుల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, రేవంత్ రెడ్డిలు బెయిల్‌పై ఉన్నారో లేదో ఆలోచించుకోవాలన్నారు. ఇతరులపై ఒకవేలు చూపించినప్పుడు నాలుగు వేళ్లు తమరి వైపు చూపిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని కవిత సూచించారు. 

కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధేస్తుంది : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తాము ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంటే బాధగా ఉందని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణను కాపాడగలరు అనే విశ్వాసం ప్రజల్లో ఉందని శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణను కేంద్రం వెనక్కితీసుకున్న తర్వాత మహోద్యమం నడిపిన నేత కేసీఆర్ అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆయన విమర్శించారు. రజతోత్సవ సభతో ప్రజల్లో ఆశలు చిగురించాయని, కేసీఆర్ ప్రసంగం వినేందుకు ప్రజలు లక్షలాదిగా వస్తారని చెప్పారు. 

తెలంగాణ తోబుట్టువులందరూ తరలిరండి

ఎక్స్‌లో కేటీఆర్

ఒక్కరితో మొదలై ఆరుదశాబ్దాల కలను కోట్లాది ఆకాంక్షను నెరవేర్చిన గులాబీ జెండా పురుడుపోసుకొని 25ఏళ్లు అని ఎక్స్ వేదికగా కేటీఆర్ అన్నారు. అంబరాన్ని అంటేలా ఇంటిపార్టీ జరుపుకుంటున్న ఈ పుట్టిన రోజు సంబురానికి తెలంగాణ తోబుట్టువులందరూ తండోపతండాలుగా తరలిరావాలన్నారు. సమాజంలోని సబ్బండవర్గాలు ఎదురుచూస్తున్న కేసీఆర్ చారిత్రక ప్రసంగాన్ని కళ్లారా వీక్షించేందుకు మీ బిడ్డగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.