calender_icon.png 19 November, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటి నెంబర్ లేని ఇల్లును కూడా సర్వే చేయండి

19-11-2024 03:06:29 PM

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఇంటి నెంబర్లు లేని ఇల్లును కూడా పూర్తిస్థాయిలోకి తీసుకొని సర్వేను చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా రాంచద్రాపురం గ్రామంలో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ లతో కలసి సర్వే చేస్తున్న విధానాన్నిపరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ఏ ఒక్క ఇంటిని వదలకుండా కుటుంబ సభ్యుల వివరాలు,  కులము, ఉప కులం తప్పకుండా నమోదు చేయాలని, ఇంటి నంబర్ లేని ఇండ్లకు, బై నంబర్ వేసి వివరాలు నమోదు చేసుకొవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కులగణన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు.