calender_icon.png 21 November, 2024 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాస్ట్ ర్యాంక్ వారిపై కూడా శ్రద్ధ చూపండి...!

14-11-2024 12:38:26 PM

ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల పార్షియాలిటీ చూపిస్తే పసి మనసు గాయపడుతుంది. 

జిల్లా జడ్జి రాజేష్ బాబు

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): తరగతి గదిలోని ప్రతి విద్యార్థిని ఒకే రకమైన పద్ధతిలో బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని లాస్ట్ ర్యాంకు సాధించిన వారిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే ఉన్నత లక్ష్యాలు సాధిస్తారని నాగర్కర్నూల్ జిల్లా జడ్జ్ రాజేష్ బాబు అన్నారు. గురువారం బాలల దినోత్సవం పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను కూడా చిన్నతనంలో టీచర్ల చేత బెత్తం దెబ్బలు తింటూనే ఉన్నత స్థానానికి ఎదిగినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మారిన విద్యార్థుల రక్షణ చట్టాలకు అనుగుణంగానే వారికి బోధన అందించాలని వారిలో పార్షియాలిటీ సూపించడం వల్ల పసి మనసులు గాయపడతాయని గుర్తు చేశారు. విలువలతో కూడిన విద్యను తరగతి గది నుంచే అందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కోర్టు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 15100 రక్షణగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వారితోపాటు సీనియర్ సివిల్ జడ్జ్ సబిత, డీఈవో గోవిందరాజులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లత, ఉపాధ్యాయులు విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేశారు.