calender_icon.png 16 October, 2024 | 6:35 PM

అల్పోజూలం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

16-10-2024 04:31:21 PM

కామారెడ్డి (విజయక్రాంతి): అల్పజోలంతో పాటు ఇతర రసాయనాలను కలిపి కల్తీకల్లు తయారు చేస్తున్నారన్నా పక్క సమాచారం మేరకు  బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీసులు సురాయి పల్లికి చెందిన రమేష్ గౌడ్ అనే వ్యక్తి వద్ద 30 గ్రాముల అల్పజూలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. లింగంపేట ఎస్సై పబ్బ అరుణ్ కుమార్ కు సమాచారం రావడంతో పోలీసు సిబ్బందితో కలిసి సురాయిపల్లి కల్లు దుకాణంలోకి వెళ్లి చెకింగ్ చేయగా కల్లు డిపోలో ఉన్న రూమ్ లో 30 గ్రాముల అల్ఫోజూలం ఇతర రసాయన పదార్థాలు లభించినట్లు తెలిపారు. సురాయి పల్లిలో కల్తీ కల్లులో అల్పోజోలం ఇతర రసాయన పదార్థాలు కలిపి కల్లు డిపోలో తయారుచేసినట్లు అందిన సమాచారం మేరకు రమేష్ గౌడ్ ను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న 30 గ్రాముల అల్ఫాజూలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రమేష్ గౌడ్ విచారించగా అల్పజూలంను ఆయన బామ్మర్ది కలాలి సత్యనారాయణ గౌడ్ నాగిరెడ్డిపేట మండలం రామక్కపల్లి చెందిన వ్యక్తి వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. రామ గౌడ్ ఇచ్చిన సమాచారం మేరకు సత్యనారాయణ గౌడ్ నుంచి 20 గ్రాముల అల్పజోలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మొత్తం 50 గ్రాముల నిషేధిత అల్పజోలం లభించినట్లు తెలిపారు. ఇద్దరుపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. నిషేధిత అల్పజూలమును పక్క సమాచారం మేరకు లింగంపేట ఎస్సై పబ్బ అరుణ్, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ భైరవ ప్రసాద్, రమేష్, రామస్వామి, సంపత్ కుమార్ లను డి.ఎస్.పి అభినందించారు. నిషేధిత అల్పజూలమును గాని ఇతర రసాయన పదార్థాలను ఎవరు ఉపయోగించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుట్కా గంజాయి లాంటి మత్తు పదార్థాలను అమ్మిన కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచి నిందితులను అరెస్టు చేసి రీమాండ్ తరలిస్తామని డిఎస్పి తెలిపారు. ఈ సమావేశంలో లింగంపేట ఎస్సై పబ్బ అరుణ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.