calender_icon.png 22 December, 2024 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఆర్ కళాశాలలను సందర్శించి పట్టభద్రుల మద్దతు కోరిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి

12-09-2024 04:57:39 PM

కరీంనగర్, (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో తాను విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతం అన్నారు ప్రముఖ విద్యా వేత్త, "అల్ఫోర్స్" విద్యాసంస్థల అధినేత  డాక్టర్ వి నరేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ , పీజీ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్  నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.... తాను చదువుకున్న ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ అండ్ పీజీ  కళాశాలకు విచ్చేసి సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలుస్తున్న సందర్భంగా ప్రభుత్వ లెక్చరర్లను కలిసి వారి మద్దతును కోరుతున్నానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన మంజూరి గురించి ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు.