calender_icon.png 25 February, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్పోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి

25-02-2025 06:15:06 PM

మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య...

కాటారం (విజయక్రాంతి): ఎంఎల్సీ ఎన్నికల్లో అల్పోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీపీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య కోరారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రచారం చేసారు. ఈ సందర్భంగా పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ... మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ కళాశాల ఏర్పడిందని, భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ అవుతుందని, కళాశాలకు సంబందించిన ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలాగా కృషి చేస్తామన్నారు.

అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలలో వూట్కూరి నరేందర్ రెడ్డికీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరి కుమార్ యాదవ్, బీరెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు చీమల సందీప్ సారధ్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఊరూరా తిరుగుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేపట్టారు. శంకరంపల్లిలో మాజీ సర్పంచ్ అంగజాల అశోక్ నేతృత్వంలో ఇంటింటికి తిరిగి, కరపత్రాలను పంచి ఓటర్లను అభ్యర్థించారు.