24-04-2025 04:38:03 PM
ఇంటర్ విద్యార్థులను అభినందించిన ఆల్ఫోర్స్ అధినేత...
నిర్మల్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని ఉద్దేశంతోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రణాళిక బద్ధంగా విద్యను అందించడం వలన ఇంటర్మీడియేటర్లో మంచి ఫలితాలు వచ్చాయని ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి(Alphores chairman Narender Reddy) అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు నిర్మల్ ఆర్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసించి ద్వితీయ ప్రతామ సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలోని నిర్మల్ ఆల్ఫోర్స్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రికార్డు సాధించడం జరిగిందని దీనికి ఉపాధ్యాయుల కృషి తల్లిదండ్రుల ప్రోత్సాహం కళాశాల అంకితభావం కారణమన్నారు.
బైపీసీలో 1000 మార్కులకు 995 ఎంపీసీలో 997 మార్కులు సాధించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు చెందిన వందలాదిమంది విద్యార్థులు ఎంపీసీ బైపీసీ విభాగంలో అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగిందని భవిష్యత్తులో నీట్, ఎంసెట్లో ర్యాంకులు సాధిస్తామని తెలిపారు.