calender_icon.png 11 January, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పౌల్ట్రీ ముసుగులో ఆల్ఫాజోలం తయారీ!

11-01-2025 01:32:43 AM

నల్లగొండ, జనవరి 10 (విజయక్రాంతి): పౌల్ట్రీఫాం ముసుగులో ఆల్ఫాజోలం అమ్ముతున్న నిందితులను శుక్రవారం మిర్యాలగూడలో  స్టేట్ టాన్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఉమామహేశ్వరం ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డాడు.

హైదరాబా దులో పనిచేసుకుంటూనే తన గ్రామంలో పౌల్ట్రీ ఫారాన్ని స్థాపించి, పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో ఆల్ఫాజోలం తయారీ యూనిట్‌ను ఏర్పా టు చేశాడు. తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాలకు తరలించి సొ మ్ము చేసుకుంటున్నాడు. శుక్రవారం తెలంగాణకు కారులో తరలిస్తున్న ఆల్ఫాజోలంను మిర్యాలగూడలో పట్టుకున్నారు.

ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి,   సీఐ నాగరాజు లతో కూడిన బృందం దాచ్‌పల్లి అద్దంకి నార్కట్‌పల్లి రోడ్డులో రాజశేఖర్‌రెడ్డితోపాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రకాశం జిల్లా దర్శి తాలూకాలోని ఉమామహేశ్వరంలో ఉన్న నిందితుడి కోళ్ల ఫారంలో దాడులు చేసి రూ.55 లక్షల విలువ చేసే  ఆల్ఫాజోలం పట్టుకున్నారు.